Category: Uncategorized

  • నాకొక పాతికేళ్లు వచ్చాక నాన్న దగ్గరికెళ్ళి..“కష్టంగా ఉంది నాన్న” అని చెప్పాలనిపించిన్నప్పుడు, నాలోపలి నుండి నాకొక స్వరం వినిపించింది “ఏదమ్మా కష్టం… పదిహేనేళ్ళ వయసులోనే జీవితంలో ఏదో సాధించాలనిపొట్టచేతపట్టుకుని బయల్దేరిన ఓ కుర్రాడి పట్టుదల కన్నానా…! తనతో పాటు వెనుకబడిన సమాజం మారాలని, ప్రగతి పథంలో పయనించాలని,  బాల కార్మికుల కోసం   ఓ యువకుడు చేసిన నిరంతర పోరాటం కన్నానా…! ఇబ్బందులు ఎన్ని ఎదురైన  పట్టు  విడువకుండా, ప్రయత్నమే శ్వాసగా సాగిన ఓ  మామూలు మనిషి కడగండ్ల కన్నానా..! ఇద్దరయ్యి ఇరవయ్యేళ్ల వయసులోనేఅరవయ్యేల…

  • నీ గురించి రాయడానికి నేనెంతనీ ప్రేమ ముందు నా ఈ పదాలెంత నా కలానికి  చెప్పా కవితలా కూర్చమని మాటలని నీకై నా చిన్ని చిన్ని పదాలని కలలు నావే అయినా కన్నది నువ్వనిఆ కలల తీరం చేరింది నేనే అయినానావలా నన్ను నడిపింది నీ నుండి వచ్చిన ధైర్యం అని ఈ ప్రయాణంలో నాకోసం నువ్వు దాటిన సంద్రాలెన్నోనన్ను సముద్రాలు దాటించడానికి నువ్వు తట్టుకున్న అలజడులెన్నో నా సంతోషానికై నువ్వు కార్చిన కన్నీరెంతోనా ఎదుగుదలకై నువ్వు భరించిన…