కళ్ళలో ప్రేమని చూస్తూ
కాలం గడిపేద్దామనుకున్న తనకు
కన్నీరు మిగిల్చిన పయనం
కంటి పాపలా నిన్ను
కాచుకుందామనుకునేలోపు
కారణాలు చూపించిన అనుభవం
కనులు తెరిచి కంటున్న కలే అయినా
కనుమరుగైపోయిన ప్రేమకోసం
కడలై వేచి చూస్తున్న చిన్ని హృదయం
ప్రళయమే అయినా ప్రణయమేగా…?
✍ Rajini Gajjela
Leave a comment