ప్రేమని పరిచయం చేశావనుకున్న
ఇప్పుడు తెలుస్తోంది..,
ప్రేమకు అలవాటు పడేలా చేశావని..!
సంతోషాన్ని పంచావనుకున్న
ఇప్పుడు తెలుస్తోంది..,
చుట్టూ ఆనందాలెన్నున్న
గుర్తించలేకపోయేంతల మార్చావని…!
జీవితాంతం నీతో కలిసి నడుద్దామనుకున్న
ఇప్పుడు తెలుస్తోంది..,
నువ్వు లేని చోట నా అడుగులు ఆపేసావని..!
రావని తెలిసినా.. పాదం సాగనంటుంది
కాదని తెలిసినా.. ప్రేమ ఆగనంటుంది
✍ Rajini Gajjela
Leave a comment