అలా…
ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన తనకు
ప్రతిచోటా అవమానమే ఎదురయ్యింది

తెలిసీ తెలియని ఆరాటంతో పడిన తన
ప్రతీ అడుగూ తడబడుతూనే ఉంది
అలుపేలేక ఎగసిన తన వాంఛలకు
అసహ్యం కూడా అలవాటుగా మారింది

ఇలా…
ఆవేదనలో సాగే ఈ పరుగు
ఆలోచనలతో ఆగేనా…!?
అలుపెరుగకుండిన ఈ అల
ఇక ఎప్పటికైనా తీరం చేరేనా

బహుశా ఇదంతా, ఒకనాటి తన కంటికి కనిపించని,
ప్రేమ తనకై జార్చిన కన్నీటి శాపమే ఇదా…???

✍🏻Rajini Gajjela

Posted in

Leave a comment